NTV Telugu Site icon

Farmers protest: రైతుల నిరసనలో ఉద్రిక్తత.. వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగం..

Farmers Protest

Farmers Protest

పంజాబ్‌-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు యత్నిస్తున్నారు. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల 17 మంది రైతులు గాయపడ్డారు. ఆ తర్వాత తోటి రైతులు గాయపడిన వాళ్లను స్ట్రెచర్లపై ఆస్పత్రికి తరించారు. కాగా.. ప్రస్తుతం 101 మంది రైతుల బృందం ఢిల్లీ మార్చ్‌ను విరమించుకుంది. మరోవైపు అంబాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 17 (అర్ధరాత్రి 12) వరకు ఇంటర్నెట్ సేవలు ఉండవు.

READ MORE: Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భర్త.. రహస్యం బయటపెట్టిన కొడుకు

కాగా.. ఈ రైతుల నిరసనకు కాంగ్రెస్ నేత బజరంగ్ పునియా స్పందించారు. రైతులను అడ్డుకోవడం లేదని ప్రభుత్వం చెబుతూనే.. అన్నదాతలపై బాష్పవాయువును ప్రయోగిస్తోందని విమర్శించారు. ఇది పాకిస్థాన్‌ బార్డర్‌లా భావిస్తున్నారన్నారు. ఒక వేళ రాజకీయ నాయకులు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపాలనుకుంటే.. వాళ్లను ఇలాగే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించమంటే వాళ్లను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురిచేస్తుందో? తెలియడం లేదన్నారు.

READ MORE:Sambhal Shiva Temple: ముస్లిం ఏరియాలో బయటపడ్డ 46 ఏళ్ల నాటి శివాలయం.. ఎలా గుర్తించారంటే? (వీడియో)

కాగా.. నిరసన చేస్తున్న రైతులు.. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కులీలకు పెన్షన్లు, విద్యుత్ చార్జీల పెంపు నిలుపుదల వంటి డిమాండ్లను రైతులు కోరుతున్నారు. దీంతోపాటు భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారానికి చర్చలు ప్రారంభించాలని రైతు నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

Show comments