NTV Telugu Site icon

Odisha: స్టేజీపై నవీన్ పట్నాయక్-మోడీ సంభాషణ.. ఆసక్తిగా చూసిన నేతలు

Cme

Cme

ఒడిశాలో బుధవారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కతమైంది. ఒకే స్టేజీపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్-ప్రధాని మోడీ ఎదురుపడ్డారు. కొంత సేపు స్టేజీపైనే సంభాషించుకున్నారు. దీంతో చుట్టూ ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.

ఇది కూడా చదవండి: Nara Bhuvaneshwari: నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.. థాంక్స్ బాలా అన్నయ్య..

ఒడిశా అసెంబ్లీలో బీజేపీ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనకు ప్రజలు స్వస్తి పలికారు. తాజా ఫలితాల్లో 147 అసెంబ్లీ స్థానాలకు గాను.. 78 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో 24 ఏళ్ల తర్వాత ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రిగా గిరిజన తెగకు చెందిన మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, తదితర కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారు. దీంతో ప్రత్యేకంగా నవీన్‌ను మోడీ కలిసి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో నవీన్ పట్నాయక్.. ఎన్డీఏ కూటమిలో ఉన్న వారే. కానీ గత ఎన్నికల్లో పొత్తు కుదరకపోవడంతో.. విడివిడిగా పోటీ చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్‌పై మోడీ విమర్శలు గుప్పించారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. అవన్ని సమసిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ