Site icon NTV Telugu

Ambati Rambabu: షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?

Ambati

Ambati

Ambati Rambabu: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారు.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు?.. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. అమరావతిది అంతులేని కథ.. పోలవరం ది ముగింపు లేని కథగా మార్చారని ఆరోపించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు.. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది.. కానీ, డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు.. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారు.. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Nishant Kumar: రాజకీయాల్లోకి సీఎం కొడుకు..

అయితే, స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు.. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారని మాజీ మంత్రి అంబటి అన్నారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు.. కానీ, అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు.. తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది.. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్నినప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు.. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు.. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు.. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది.. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై కేంద్రం ఆగ్రహం.. ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాలి

ఇక, జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారని వైసీపీ నేత రాంబాబు పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు విమర్శించారు.. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే.. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు.. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు? అని ప్రశ్నించారు. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?.. చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?.. హైదరాబాదులోని ఇంట్లోకి పవన్ కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు.. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ ని విమర్శిస్తున్నాడు.. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు.. షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా? అని అంబటి రాంబాబు అడిగారు.

Exit mobile version