Warangal: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమవిఫలమవ్వడంతో చెన్నరావుపేట మండలం ధర్మతండాకు చెందిన మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. తాను ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగదని తేలడంతో మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు మహేష్ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్ మరణంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ధర్మతండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
READ MORE: Bollywood : మరోసారి పవర్ ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేయనున్న హ్యుమా ఖురేషీ