తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే ఆయా పార్టీల అధిష్టానాలు ఎన్నికల బరిలోకి దించేందుకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం ఓటర్లు 28,92,786 ఉండగా.. అందుతలో మహిళలు14,60,915, పురుషులు 13,31,395లు ఉన్నారు. అయితే.. పురుషులకంటే మహిళా ఓటర్లు 1,29,520 ఎక్కువగా ఉండటం విశేషం. అయితే.. ఉమ్మడి జిల్లాలో వర్దన్నపేట, స్టేషన్ ఘనపూర్ ఎస్సీ రిజర్వు. ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ మూడు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వు. 2018 ఎన్నికల్లో 12 స్థానాల్లో బిఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకుంది. కేవలం ములుగు, భూపాలపల్లి లో కాంగ్రెస్ గెలిచింది. ఏడాదిలోగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ కు చేయిచ్చి కారెక్కి గులాబీ గూటిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Also Read : Chandrababu Case: బెయిల్, కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య కు టికెట్ నిరాకరణ. ములుగు లో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ను ఎదుర్కొనేలా అదే సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి బరిలోకి దింపిన బీఆర్ఎస్. జనగామ టికెట్ విషయంలో సస్పెన్స్ నేడో రేపో తెరపడనుంది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు. ముత్తిరెడ్డి కి టిఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో నిన్ననే పదవి బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కి టిక్కెట్ ఖరారు చేసారు. రాజయ్యకు రైతుబందు సమితి చైర్మన్ పదవి ఇవ్వగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ నుంచి పాలకుర్తి లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లొలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రదాన పోటీ. బీజేపీ పోటీ ఉమ్మడి జిల్లాలో నామమాత్రమేకానుంది.
Also Read : Minister KTR : సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు