Singareni Coal Production: యుద్ధ ప్రభావం సింగరేణి మీద పడింది. ఉత్పత్తిలో టార్గెట్ ను రీచ్ కాలేకపోతుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి దానికి యుద్ధానికి లింక్ ఏంటి యాజమాన్యం ఏమంటుంది? ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ దేశానికే తలమాణికం. ఇది పారిశ్రామికీకరణతో పాటు అనేక ధర్మల విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న 12 ఏరియాల్లో 18 ఓపెన్ కాస్ట్ గనులు 19 భూగర్భ గనులు ఉన్నాయి. ఇందులో ఓపెన్ కాస్ట్ గనుల్లోనే 80% నికి పైగా బొగ్గు ఉత్పత్తి సాగుతుంది. అనుకున్న టార్గెట్ ను ఓపెన్ కాస్ట్ గనులే తీర్చుతూ ఉంటాయి.
అయితే ఇప్పుడు సింగరేణికి ఇప్పుడు యుద్ధం సమస్య వచ్చిపడింది. యుద్ధంతో పేలుడు పదార్థాల కొరత ఏర్పడింది. ఇప్పటికైతే అధికారికంగా స్పష్టం చేయడం లేదు. కానీ.. పేలుడు పదార్థాల కొరత ఉంది. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తిలో ఓపెన్ కాస్ట్ గనులు కీలకంగా ఉంటున్నాయి. అయితే ఇందులో బొగ్గు ఉత్పత్తి చేయడానికి ముందుగా మట్టిని తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బొగ్గు వెలికి తీస్తారు. మట్టి బొగ్గు వెలికి తీయడానికి పేలుడు పదార్థాలు అవసరం ఉంటాయి. అవి ఎక్కువ శాతం ఓడల ద్వారానే వస్తాయి. సింగరేణి వ్యాప్తంగా ప్రతి ఏట 3 లక్షల టన్నుల పేలుడు పదార్థాలు అవసరమవుతాయని అంచన.
ఓపెన్ కాస్ట్ లో రోజుకు 800 టన్నల సైట్ మిక్స్డ్ ఎమల్షన్ అవసరం ఉంటుంది. అయితే ఈ పేలుడు పదార్థాల ఉత్పత్తికి అమ్మోనియం నైట్రేట్ అవసరం అవుతుంది. అది విదేశాల నుంచి దిగుమతి కావలసి ఉంటుంది. ఈ దిగుమతిని యుద్ధం ప్రారంభమైన తర్వాత సగానికి సగం వరకు తగ్గించారు. దీనితో తెలంగాణలో అతి పెద్ద పరిశ్రమైన సింగరేణలో కూడా దాని ప్రభావం పడనుంది. డీజిల్, పెట్రోల్ కొరత వచ్చే విధంగా సింగరేణి రాబోయే కాలంలో ఎదుర్కొనే సమస్యల్లో మొట్టమొదటిది. ఒకవైపు పేలుడు పదార్థాల కొరత ఉంటే.. మరోవైపున డీజిల్ కొరత కూడా తీవ్రంగానే ఉంది. సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున ఇది అవసరం అవుతుంది. ఓపీలో షావల్, డంపర్లు, డోజర్లు, భారీ వాహనాలు, పలు రకాల యంత్రాలు వాడకానికి డీజిల్ అవసరం ఉంది. దీనికోసం ప్రతిరోజు 10 లక్షల లీటర్ల వరకు డీజిల్ ని ఉపయోగిస్తూ ఉంటారు.
Moinabad Drugs Case Twist: మోయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. SIT దర్యాప్తులో కొత్త నిజాలు బట్ట బయలు..!
అయితే అంత పెద్ద మొత్తంలో డీజిల్ సరఫరా చేయలేమని చమురు సంస్థలు చెప్పాయి. దీనితో ఆ యుద్ధం ప్రభావం సింగరేణి మీద పడుతుందది ప్రత్యక్షంగా. దీనికి కారణం సింగరేణికి అవసరమైనటువంటి ఇంధనం అలాగే సింగరేణిలో వాడేటువంటి బ్లాస్టింగ్ కు వాడేటువంటి సరకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా దొరకడం చాలా కష్ట సాధ్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని కారణంగా సింగరేణి ఉత్పత్తి మీద ప్రభావం చూపెడుతుంది. యుద్ధంతో పెద్ద సమస్య సింగరేణికి ఎదురవుతుందని సింగరేణి కార్మికులు కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. పశ్చిమ ఆసియా దేశాలలో జరుగుతున్న యుద్ధాల వల్ల సింగరేణనికి కొంత ప్రభావం ఎఫెక్ట్ పెరుగుతూ ఉంది. అంతే కాదు భారీగా నష్టం జరిగే ప్రమాదం ఉంది.
