Renault Cars: కారులో తిరగాలని ఆశపడుతున్నారా.. మీ బడ్జెట్ లో కారు దొరకడం లేదా..? టెన్షన్ పడకండి. మీకు అనువైన ధరలో.. మీ ఆశలు నెరవేర్చేందుకు భారీ డిస్కౌంట్లతో మీ ముందుకు తీసుకువస్తుంది ప్రముఖ కంపెనీ. 10 కాదు 20 కాదు.. దాదాపు రూ.65 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. కానీ ఈ ఆఫర్ ఎక్కువ రోజులు కాదండోయ్.. ఈ జూన్ వరకు మాత్రమేనండీ. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి కారును తెచ్చుకోండి.
Read Also: Off The Record: టీడీపీ, బీజేపీ మధ్య 2014 సీన్ రిపీట్ అవుతుందా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా బంపర్ డిస్కౌట్ ఆఫర్స్ ప్రకటించింది. వివిధ రకాల మోడళ్లపై గరిష్టంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. మీరు బడ్జెట్ ధరలో మంచి కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. ఈ నెలలో కివిడ్, కైగర్, ట్రిబెర్ వంటి కార్ల మోడళ్లపై క్యాష్ డిస్కౌట్లు, కార్పొరేట్ బోనస్, ఎక్స్చేంజ్ బోన్సస్, లాయల్టీ బోనస్ వంటివి పొందవచ్చు. అయితే, కార్లపై వచ్చే డిస్కౌంట్ కార్ల మోడల్ బట్టి, డీలర్‌షిప్ లొకేషన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో రెనాల్ట్ కంపెనీ ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read Also: Off The Record: ఏపీలో విపక్షాల ముందస్తు ఊహలు ఉత్తిత్తివేనా..? వైసీపీ వ్యూహాలేంటి..?
జూన్ నెలలో కార్లు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ కార్లపై డిస్కౌంట్ ఇలా ఉన్నాయి. రెనాల్ట్ కంపెనీకి చెందిన కివిడ్ మోడల్ కారును కొనుగోలు చేసినట్లయితే రూ.57 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ కారు ధర రూ.4.70 లక్షల నుంచి మొదలై రూ.6.45 లక్షల వరకు ఉంటుంది. రెనాల్ట్ కైగర్ కారును గనుక మీరు కొనుగోలు చేసినట్లయితే మీకు గరిష్ఠంగా రూ. 65 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రెనాల్ట్ కైగర్ ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెనాల్ట్ ట్రైబర్ ఎస్‌యూవీ కారు ఈ జూన్ నెలలో కొనుగోలు చేసినట్లయితే మీకు రూ.45 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆ కారు ధర రూ.6.34 లక్షల నుంచి రూ.8.98 లక్షల వరకు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి కొనుగోలు చేయండి.