Russia: రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wagner chief Yevgeny Prigozhin Died in Plane Crash: రష్యాలో విమాన ప్రమాదం జరిగింది. . మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతున్న విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్ రీజియన్‌లో కుప్ప కూలింది.ఇది ఒక ప్రైవేట్ విమానం. ఇందులో 10 మంది ఉన్నారు. పైలెట్, క్రూ కాకుండా ఆరుగురు ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇందులో విస్తుగొలిపే విషయం ఏంటంటే ఈ విమాన ప్రమాదంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించలేదు. అయితే విమానంలో ప్రయాణించిన 10మంది పేర్లలో ఒక పేరు ప్రిగోజిన్ ఇంటి పేరుతో సహా సరిపోయిందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ వెల్లడించింది.ఇదే విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా పేర్కొ్నాయి. అయితే ఈ ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రెండు నెలల క్రితం రష్యాలో అంతర్యుద్ధం ప్రకటించింది వాగ్నర్ గ్రూప్. అప్పుడు వాగ్నర్ గ్రూప్, ప్రిగోజిన్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగాయి. ఈ సందర్భంగానే ప్రిగోజిన్ మరణం వెనకాల పుతిన్ ఉన్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Miyapur Firing: ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్‌పై కాల్పులు.. అసలు కథ ఇదీ..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక వాగ్నర్ గ్రూప్ విషయానికి వస్తే 2014లో మొదటిసారి దీనిని ఏర్పాటు చేశారు. ఇది రష్యా ప్రైవేటు మిలటరీ దళంగా ఉండేది. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతోనే వాగ్నర్ గ్రూప్ పుట్టుకొచ్చింది. దీనిలో చాలా మంది ఖైదీలే ఉండేవారు. 5000 మంది ఒక ప్రైవేటు సైన్యంలా పనిచేసేవారు. చాలా విషయాల్లో ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అండగా ఉండేది. ప్రిగోజిన్ కు ముద్దుగా పుతిన్ చెఫ్ అనే పేరు కూడా ఉండేది. మొదట్లో హాట్ డాగ్స్ అమ్మిన ప్రిగోజిన్ ఆ తరువాత రెస్టారెంట్లు, క్యాంటిన్ లు తెరిచాడు. అంతేకాదు రష్యా అధ్యక్షుడి అధికారిక భవనం క్రెమ్లి్న్ కు ఫుడ్ ను సరఫరా చేసేవాడు. దీంతో అతడికి పుతిన్ చెఫ్ అనే పేరు వచ్చింది. ఒకప్పుడు పుతిన్ కు కుడిభుజంలా ఉండేవాడు ప్రిగోజిన్. అయితే ఉక్రెయిన్ విషయంతో రష్యాకు ఎదురుతిరిగింది ఈ గ్రూప్ అంతర్యుద్ధాన్ని ప్రకటించింది. తరువాత ఆ విషయం సర్ధుమణిగింది. అయితే ఇంత సడెన్ గా విమానం కూలి ప్రిగోజిన్ మరణించడం పలు అనుమానాలకు తావిస్తుంది.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!