Sajjala Ramakrishna Reddy: వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు. డ్వాక్రా సంఘాలు మేము అధికారంలోకి వచ్చే సమయానికి దెబ్బతిన్నాయని.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలలో కోటి పదిహేను లక్షల మందికి సభ్యుల సంఖ్య పెరిగిందని.. ఇది ఆల్ ఇండియా రికార్డ్ అని పేర్కొన్నారు. జగన్ వచ్చిన తరవాత డ్వాక్రా గ్రూపులు పెరిగాయని.. సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించామని చెప్పారు. 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు.
Read Also: Big Breaking: శివకాశిలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం…
టీడీపీ హయాంలో జీఎస్‌డీపీ 4.47 ఉంటే, వైసీపీ హయాంలో జీఎస్‌డీపీ 4.87 కి పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు పెరిగాయన్నారు. మోడీ వచ్చి మేమే అంతా ఇచ్చాం అంటున్నారని.. కానీ కేంద్రం నుంచి వచ్చే సాయం తగ్గిందన్నారు. టీడీపీ హయాంలో 2 లక్షల 58 వేల కోట్ల అప్పులు అయితే… వైసీపీ హయాంలో 2 లక్షల 95 వేల కోట్ల రూపాయల అప్పులు అయ్యాయన్నారు. వైసీపీ హయాంలో సంక్షేమం నుంచి అభివృద్ధికి వెళుతున్నామన్నారు. పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని.. రామయ్యపట్నం పోర్టు దగ్గర కంపెనీలు రావడం మొదలు అయ్యాయన్నారు. 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చాము.. అయిదు మెడికల్ కాలేజీలు మొదలు అయ్యాయన్నారు. ఏపీలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం తీసుకువస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు తీసుకువచ్చామన్నారు. ఒక వైపు అభివృద్ధి.. మరో వైపు సంక్షేమం కొనసాగుతుందన్నారు. వైజాగ్ గ్రోత్ ఇంజన్ అవుతుందని.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ జగన్ రావాలన్నారు.