NTV Telugu Site icon

Russia Ukraine war: ఉక్రెయిన్‌తో యుద్ధం ఓడిపోతే పుతిన్‌ను హతమార్చుతారు..

Elon Musk

Elon Musk

Elon Musk: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే ఛాన్స్ ఉందన్నారు. దీంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.. దీని వల్ల ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Telangana Assembly: ప్రారంభమైన బడ్జెట్ పై చర్చ.. కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, సీతక్క

అయితే, మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో తనని చాలా మంది విమర్శిస్తున్నారన్నారు. కానీ, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పారు. ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో రష్యా ఓడిపోయే అవకాశం లేదన్నారు. ఇంకా ఉక్రెయిన్‌ గెలుస్తుందనుకోవడం కూడా ఆ దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని పేర్కొన్నారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం వారికే నష్టమని అతడు చెప్పాడు. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎలాన్ మస్క్ తెలిపాడు.

Read Also: Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!

రష్యాను అణచివేయడానికి తమ కంపెనీల కంటే మరేవీ గొప్పగా పని చేయలేదని ఎలాన్ మస్క్‌ అన్నారు. ఉక్రెయిన్‌కు స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను అందిస్తోందనే విషయని అతడు గుర్తు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా కీవ్‌ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారిందని చెప్పారు. రష్యా అంతరిక్ష వ్యాపారాల నుంచి స్పేస్‌ఎక్స్‌ దూరం అయింది.. రెండు వైపులా ప్రాణ నష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యం అని అతడు పేర్కొన్నాడు. మరోవైపు రష్యాలో వ్లాదిమిర్ పుతిన్‌ ను గద్దె దించాలనుకునేవారు.. అతడి స్థానంలో ఎవరిని నియమిస్తారని మస్క్ ప్రశ్నించారు. వచ్చే వాళ్లు మరింత కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉందన్నాడు.