Site icon NTV Telugu

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నోట అణు విస్పోటనాల మాట.. ఉక్రెయిన్‌కు ముప్పు తప్పదా?

Vladimir Putin

Vladimir Putin

Vladimir Putin: ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పుతిన్ ఫ్రాన్స్ దేశాధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో మాట్లాడుతూ, హిరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనాల గురించి ప్రస్తావించారు. యుద్ధంలో గెలవాలంటే ఇలా ప్రధాన నగరాలపైనే దాడి చేయనక్కర్లేదు అంటూ ఎక్కడైనా అణుబాంబు వేయొచ్చన్న రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచుగా అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన అగ్రరాజ్యం అమెరికా, పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు చేస్తున్నట్టే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. తాజాగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయితే పుతిన్ మరోసారి అణుయుద్ధం గురించి మాట్లాడడం పాశ్చాత్యదేశాల అధినేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వారు కలవరపడుతున్నారు. కాగా, యూరప్ లో శీతాకాలం వస్తే మంచు పరిస్థితుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాని పుతిన్ భావిస్తే అణ్వస్త్ర ప్రయోగానికి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

KA PAUL Sesational Comments: కేఏ పాల్ వేదాంతం.. కామెంట్స్ వైరల్

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేసిన సంగతి తెలిసిందే. 1945 ఆగస్టు 6న హిరోషిమా పైనా, ఆగస్టు 9న నాగసాకిపైనా రెండు అణుబాంబులు ప్రయోగించింది. ఈ అణ్వస్త్ర ప్రయోగంతో జపాన్ లొంగిపోగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ రెండు నగరాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది.

Exit mobile version