NTV Telugu Site icon

Naresh-Pavitra Lokesh : నాకు మరో అమ్మ దొరికింది..ఉద్వేగభరితమైన నరేష్

Vk Naresh

Vk Naresh

Naresh-Pavitra Lokesh : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఎవరంటే పవిత్రలోకేష్ నరేష్ అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. వీకే నరేష్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. వీకే నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్‌కుమార్, శరత్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు వీకే నరేష్ ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్టాడుతూ ‘వేదికను అలంకరించిన నాలో సగభాగం. నా అభిమానులు, మూవీ ఆర్టిస్టుల సంతోషం సహకారంతో ముందుకు సాగుతున్నాను. రీల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు రియల్ లైఫ్ గురించి మాట్లాడాలి. నేను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు పండంటి కాపురం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో నాతోపాటు నా అక్కయ్య జయసుధ కూడా ఆ సినిమాలో నటించింది. మా ఇద్దరి ప్రయాణం సినీ పరిశ్రమలో 50 ఏళ్లు.

Read Also:Amit Shah: ఓటర్ల జాబితాతో జనన, మరణ వివరాలు లింక్.. కొత్త బిల్లును తీసుకురానున్న కేంద్రం

నాకు ఫస్ట్ మేకప్ వేసిన మాధవరావు, రాము టచప్ అసిస్టెంట్ వేసిన విషయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను. ఎస్వీ రంగారావు, గుమ్మడి, కృష్ణ, జమున, విజయనిర్మలతో కలిసి ప్రయాణం మొదలుపెట్టడం గర్వంగా ఉంది అని వీకే నరేష్ చెప్పారు. మా అమ్మ అలా బాధపడింది: నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరికో మంచి చేయడానికి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అది ఎవ్వరికి లాభం చేయలేదు. మరోసారి నా జీవితంలో మంచి చేయాలని నిర్ణయం తీసుకొంటే.. ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. మరోసారి మంచి చెద్దామని అనుకొంటే.. చెడు ఎక్కువగా జరిగింది. మా అమ్మ చివరగా నాకు చెప్పింది.. నేను అన్నీ ఇచ్చాను. రాజును చేశాను. కానీ మంచి జీవితం ఇవ్వలేకపోయానని బాధపడింది. అయితే ఫర్వాలేదు. కానీ నేను నీ తర్వాత మరో అమ్మను కలిశానని గర్వంగా చెప్పాను అంటూ పవిత్రా లోకేష్‌ను చూపించారు. నా జీవితంలో చాలా లైఫ్ గడిచిపోయింది. రీల్ లైఫ్ బాగుంది. కానీ రియల్ లైఫ్ బాగాలేదు. కాన 50 ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత మా అమ్మ తర్వాత ఇంకా మరో అమ్మను కలుసుకొన్నాను. నా జీవితంలో చివరికి నా గమ్యాన్ని చేరుకొన్నాననే నమ్మకం పవిత్రా లోకేష్‌తో కలిగిందంటూ ఉద్యేగభరితంగా మాట్లాడారు.

Read Also:Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్‌ అరెస్ట్

Show comments