Vivo Y58 5G Price Smartphone Launch and Price in India: చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన ‘వై’ సిరీస్‌లో ‘వివో వై58 5జీ’ ఫోన్‌ను గురువారం (జూన్ 20) రిలీజ్ చేసింది. ఈ మిడ్ సెగ్మెంట్ ఫోన్.. ప్రీమియం డిజైన్, శక్తిమంతమైన బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, డ్యుయల్ స్టీరియో స్పీకర్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువే అయినా.. ఇందులో 6000mAh బ్యాటరీ ఉండడం విశేషం. వివో వై58 5జీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివో వై58 5జీ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియెంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ స్టోరేజ్ ధర రూ.19,499గా ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 8జీబీ, స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.1,500 వరకు రాయితీ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈస్టోర్ సహా అన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. హిమాలయన్ బ్లూ, సుందర్బన్స్ గ్రీన్ రంగుల్లో వివో వై58 5జీ లభ్యమవుతుంది.
Also Read: IND vs AFG: అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం.. సూపర్-8లో భారత్ శుభారంభం!
వివో వై58 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రీఫ్రెష్ రేటుతో కూడిన 6.72 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో ఇది పని చేస్తుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో ఇచ్చారు. ఫోన్ వెనకాల f/1.8 + f/2.4 అపెర్చర్‌తో కూడిన 50 MP + 2 MP కెమెరా.. ముందు f/2.05 అపెర్చర్‌తో 8 MP కెమెరా ఉంది. 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh లిథియం ఐయాన్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది.