Vivo V50 Elite Edition: రూ.1899 విలువ చేసే ఇయర్‌బడ్స్ ఉచితంగా అందిస్తూ భారత్ లో వివో V50 ఎలైట్ ఎడిషన్ విడుదల..!
- vivo V50 ఎలైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల
- vivo TWS 3e ఇయర్‌బడ్స్ ఫ్రీ.
- ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి విడుదలైన వివో V50 ఎలైట్ ఎడిషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo V50 Elite Edition: వివో సంస్థ ఈ ఫిబ్రవరిలో భారత్‌లో తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ vivo V50 ను విడుదల చేసింది. తాజాగా అదే సిరీస్‌లో vivo V50 ఎలైట్ ఎడిషన్ ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో vivo TWS 3e ఇయర్‌బడ్స్ డార్క్ ఇండిగో కలర్‌లో ఫ్రీగా అందిస్తారు. ఈ ఇయర్‌బడ్స్ 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి ఉంటాయి.
Read Also: Rajnath Singh: పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..? అంతర్జాతీయ జోక్యం అవసరం..!
Also Read
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
ఇక ఈ vivo V50 ఎలైట్ ఎడిషన్ పలు ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి విడుదలైంది. ఇందులో 6.77 అంగుళాల FHD+ (2392 × 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే అందించబడింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఆకర్షణీయ లక్షణాలతో వస్తోంది.
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. ఈ ఫోన్‌లో శక్తివంతమైన Qualcomm స్నాప్ డ్రాగన్ 7 Gen 3 (4nm) చిప్‌సెట్‌ను Adreno 720 GPU తో కలిపి ఉపయోగించారు. ఇది 12GB LPDDR4X RAM, 512GB UFS 2.2 స్టోరేజ్ తో లభిస్తోంది.
ఇక కెమెరా విభాగంలో.. 50MP ప్రధాన కెమెరా (OIS, ZEISS ఆప్టిక్స్) తో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా కలిపి రెండు వెనుక కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ Android 15 ఆధారిత Funtouch OS 15 తో రన్ అవుతుంది. ఇది ఆధునిక ఫీచర్లతో యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
Read Also: Team India: ప్రమాదంలో టీమిండియా ?
ఈ మొబైల్ కు IP68, IP69 రేటింగ్ ఉండడం వల్ల నీటి, ధూళి నుండి రక్షణ కలిగిస్తుంది. అదనంగా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G బ్యాండ్‌లకు, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS మొదలైన ఆధునిక నెట్‌వర్క్ ఫీచర్లకు మద్దతు ఉంది. ఇక ఈ ఫోన్‌కు 6000mAh భారీ బ్యాటరీ తో పాటు 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. దీని వలన వేగంగా చార్జింగ్ అవడం మాత్రమే కాదు, ఎక్కువ సమయం పని చేయగలదు కూడా.
vivo V50 ఎలైట్ ఎడిషన్ రూ.41,999 ధరకు లభ్యమవుతుంది. ఇది స్టాండర్డ్ ఎడిషన్ కంటే కేవలం రూ. 1000 ఎక్కువ. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, అలాగే అన్ని భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటుంది. ఇక లాంచ్ ఆఫర్ కింద.. ఆన్లైన్ లో HDFC, SBI, Axis బ్యాంక్ కార్డ్స్ పై రూ. 3000 వరకు ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 3000 ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అలాగే 6 నెలల వరకు No Cost EMI సదుపాయం కలదు. అలాగే ఆఫ్లైన్ కూడా మరికొన్ని ఆఫర్లు అందించనున్నారు.
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!