Site icon NTV Telugu

Vivek Venkataswamy : అర్వింద్ ఇంటిపై దాడి చేసింది తెలంగాణ వ్యతిరేకులే

Vivek Venkataswamy

Vivek Venkataswamy

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటి వద్ద ఈ రోజు ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అర్వింద్‌ ఇంటి ముందు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు వచ్చి.. ఆయన నివాసంపై దాడి చేశారు. దీంతో అర్వింద్‌ ఇంటి వద్ద టెన్షన్‌ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు. భారీగా బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. తాజా ఈ ఘటనపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఇంటిపై టీఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. ధర్మపురి శ్రీనివాస్ సతీమణి ఇంట్లో ఉన్నప్పుడు హింస చేయడం దారుణమన్నారు.
Also Read : Nandamuri Balakrishna: మొన్న ఎన్టీఆర్ చేసింది తప్పైతే.. ఇప్పుడు బాలయ్య చేసిందేంటి..?

2004లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా అరవింద్ వాళ్ల నాన్న శ్రీనివాస్ ఉన్నారని, 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తులో కీలక పాత్ర పోషించింది డి. శ్రీనివాస్, వెంకటస్వామి అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బతికించింది డి. శ్రీనివాస్, వెంకటస్వామి అని ఆయన గుర్తు చేశారు.
Also Read : Bandi Sanjay : ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని అప్పటి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించారు.. అయినప్పటికీ డి. శ్రీనివాస్, వెంకటస్వామి కేసీఆర్ కి మద్దతు ఇచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో డి. శ్రీనివాస్, వెంకటస్వామి పాత్ర కీలకంగా ఉందని, కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వ్యతిరేకులు నాపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అర్వింద్‌ ఇంటిపై దాడి చేసింది తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల సహాయంతో టీఆర్ఎస్ గుండాలు అర్వింద్‌ ఇంటిపై దాడి చేశాయని ఆయన అన్నారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి సరైన గుణపాఠం చెప్తామని ఆయన అన్నారు.

Exit mobile version