Health Tips : మెరిసే చర్మానికి విటమిన్ సి చాలా అవసరం.. అందుకే ఈ ఆహారాలను తీసుకోండి
- చర్మం మెరిసి పోవాలంటే విటమిన్ సి అవసరం
- సిట్రస్ పండ్లలో పుష్కలంగా విటమిన్ సి
- ఉసిరి బ్రోకలీ క్యాప్సికమ్‌లో కూడా పుష్కలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే పోషకాల లోపం ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తుంది. దీని ప్రభావం ఆరోగ్యంపైనే కాదు అందం మీద కూడా కనిపిస్తుంది. శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే జుట్టు, చర్మం పొడిగా మారవచ్చు. అందుకే ఫేస్ ప్యాక్‌లను తయారు చేసేటప్పుడు ప్రజలు విటమిన్ సి క్యాప్సూల్స్‌ను వాడుతుంటారు. అందుకే ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం మంచిది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది సిట్రస్ పండ్లు. కానీ విటమిన్ సి అనేక ఇతర పండ్లు, కూరగాయలలో కూడా పుష్కలంగా లభిస్తుంది. వాటిని రెగ్యులర్ గా ఆహారంతో తీసుకోవచ్చు.
Read Also:Maharashtra: ‘స్నాప్‌చాట్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి తండ్రి నిరాకరణ..ఉరేసుకుని కుమార్తె ఆత్మహత్య
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
పోషకాహార నిపుణురాలు నిధి కాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. దీనిలో విటమిన్ సి ప్రయోజనాలు.. ఏ పండ్లు , కూరగాయలలో ఎక్కువగా ఉంటాయన్న సమాచారం అందించారు. విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్, ఇది అనేక ఆహారాలలో ముఖ్యంగా పండ్లు, కూరగాయలలో లభిస్తుంది. ఇది మీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, గాయాలను నయం చేయడంతో దోహద పడుతుంది. దీనితో పాటు ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సి కూడా అవసరం.
Read Also:Kishan Reddy: పంచె కట్టులో కిషన్ రెడ్డి.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు..
పురుషులు 90 మి.గ్రా , స్త్రీలు 75 మి.గ్రా విటమిన్ సిని వారి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. అయినప్పటికీ, సిట్రస్ పండ్లు విటమిన్ సికి మూలం. కానీ దీనితో పాటు విటమిన్ సి ఇతర పండ్లు, కూరగాయలలో కూడా పుష్కలంగా లభిస్తుంది. కొన్ని సిట్రస్ పండ్ల కంటే పెద్ద పరిమాణంలో కూడా వాటిలో విటమిన్ సీ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి , వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆహారంలో విటమిన్ సి చేర్చుకోవడం ముఖ్యం. సిట్రస్ పండ్లు, ఉసిరి, బ్రోకలీ, క్యాప్సికమ్‌లో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. 100 గ్రాముల నారింజ వంటి సిట్రస్ పండ్లలో 59మి.గ్రా.. 100 గ్రాముల నిమ్మకాయలో 53మి.గ్రాల విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల బ్రోకలీలో 65మి.గ్రా పరిమాణంలో విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి 100 గ్రాముల పసుపు, ఎరుపు క్యాప్సికమ్‌లో 183 మి.గ్రా. 100 గ్రాముల జామపండులో 223 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. 100 గ్రాముల ఉసిరిలో 300 మి.గ్రా పరిమాణంలో విటమిన్ సి లభిస్తుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?