Laila : విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం కాస్త గట్టిగానే ఉన్నట్టున్నాయి. ఓవరాల్‌గా విశ్వక్ లేడీ గెటప్ మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది.
Read Also:Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది..
కాగా లైలా కోసం చిత్ర హీరో విశ్వక్ సేన్ నిర్మాత సాహు గారపాటి స్వయంగా వెళ్లి మెగాస్టార్ ను కలిసి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాలని కోరగా అందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిరంజీవి లైలా గెటప్ లో విశ్వక్ చాలా బాగున్నాడని మెచ్చుకున్నారు. తమ ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదన్నారు. ఒక హీరోకు అయినా మరో హీరో పైన అభిమానం ఉండవచ్చు కానీ తామంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం అన్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తున్నారా లేదా అన్న దానికి క్లారిటీ వచ్చేసింది. ఒకానొక సమయంలో హీరోయిన్ కామాక్షికి తమ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇచ్చినట్లుగా కూడా తెలిపారు. అలాగే 30ఇయర్స్ పృథ్వీ గురించి చెప్పే సందర్భంలో ప్రజారాజ్యం జనసేనగా పరివర్తన చెందిందని స్పష్టం చేశారు. జనసేన పేరు చిరు నోట రాగానే జైజనసేన నినాదాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ సినిమాలో లేడి గెటప్ లో కనిపించేందుకు విశ్వక్ చాలా కష్టపడ్డాడు. సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న విశ్వక్ సేన్ కు లైలా తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Thandel : తండేల్ సక్సెస్ పై నాగార్జున రియాక్షన్.. సోషల్ మీడియాలో పోస్ట్