మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా తగ్గకూడదని మేకర్స్ పట్టుదలగా ఉండటంతో విడుదల ఆలస్యమైంది. అలా క్వాలిటీ కోసం ఎంత సమయమైనా తీసుకోవాలని యూవీ క్రియేషన్స్ నిర్ణయించుకోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే
Also Read : Naduma Murari : శర్వానంద్-శ్రీవిష్ణు మల్టీస్టారర్?
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్‌డేట్ రాబోతోంది. అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఒక పవర్‌ఫుల్ వీడియో టీజర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఈ కొత్త టీజర్ మెగాస్టార్ ఫాంటసీ సినిమాల రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి విజువల్ వండర్స్‌ను ‘విశ్వంభర’ గుర్తు చేస్తుందో లేదో చూడాలి..