Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!

Vishwak Sen's Funky Movie

Vishwak Sen's Funky Movie

విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీతో కలిసి చేస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే సాంగ్స్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను హీరోయిన్ కయాదు లోహర్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా బిగ్గెస్ట్ ఇన్ సెక్యూరిటీ.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

ఫిబ్రవరి 7న (శనివారం) హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీరాములు 70mm థియేటర్లో సాయంత్రం 4 గంటలకు అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. అనుదీప్ మార్కు సెటైరికల్ కామెడీ.. విశ్వక్ సేన్ మాస్ ఎనర్జీ కలిస్తే ‘ఫంకీ’ ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్‌తో ఒక స్పష్టత రానుంది. ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా సినిమా థియేటర్లలో విడుదల కాబోతుండటంతో, మూవీ టీమ్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ‘ఫంకీ’ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.