Vishwak Sen : మరొక ఫ్లాప్ దర్శకుడితో విశ్వక్ సేన్..
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. తాజాగా కేవీ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన ఫంకీ డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు విశ్వక్. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో ‘దేవ్ వంటి డిజాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రజత్ రవిశంకర్, ఇప్పుడు విశ్వక్ సేన్‌తో తన తర్వాతి సినిమాను చేయబోతున్నారు. ‘దేవ్’ ఆశించిన విజయం సాధించకపోవడంతో దాదాపు ఏడేళ్ల విరామం తీసుకున్న రజత్, ఇప్పుడు పక్కా స్క్రిప్ట్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Also Read : Vishal : నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్.. ఆ డబ్బు తిరిగి కట్టాల్సిందే.. లేదంటే జైలుకే
ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ దేవర వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ‘దేవర2 మరియు ఇతర పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, విశ్వక్ సేన్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టాలెక్కిస్తోంది. ఇది విశ్వక్ సేన్ కెరీర్లో ఒక విభిన్నమైన జోనర్ మూవీగా ఉండబోతుందని సమాచారం. విశ్వక్ సేన్ ప్రస్తుతం లెగసీ, ఫంకీ వంటి విభిన్న చిత్రాలతో పాటు తన సొంత దర్శకత్వంలోనూ సినిమాలు చేస్తున్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో చేయబోయే ఈ చిత్రం స్టైలిష్‌గా ఉంటూనే మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలతో ఉండబోతుందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత రజత్ చేస్తున్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట రజత్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఇతర నటీనటుల సమాచారాన్ని మేకర్స్ వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!