Site icon NTV Telugu

VishnuVardhan Reddy: వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు

Vishnuvardhan On Ysp

Vishnuvardhan On Ysp

మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందన్నారు. రాయలసీమలో పర్యటించకపోయిన ఫర్లేదు…. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజా తీర్పు…వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం,క్రీడల పై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

దక్షిణాదిలో ప్రముఖ క్రీడాకారులు బయటకు రావడం..గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతోంది. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు…రాష్ట్రపతి అభ్యర్థి పై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కెసిఆర్..కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.కేసీఆర్ పీఎం అవుతారని ఊహల్లో విహరిస్తున్నారు. మతి భ్రమించిన పార్టీ టీఆర్ఎస్…. అగ్నిపథ్ స్కీమ్ పై రాజకీయ దుమారం రేపింది టిఆర్ఎస్ పార్టీనే.

టిఆర్ఎస్ పార్టీ నాయకులే ప్రభుత్వ ఆస్తులు తగలబెడుతున్నారు. ఏపీలో డెడ్ బాడీలను డోర్ డెలివరీ ఇస్తుంటే….తెలంగాణలో ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తులు తగలబెడుతోంది. ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీల కుట్రతోనే రైల్వే స్టేషన్ తగలబెట్టారు. కొన్ని వందల ఏళ్ల చరిత్రను అవమానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. పాకిస్థాన్ జిందాబాద్ అని ఎంఐఎం నేత నినాదాలు చేస్తే…సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

Agnipath: అగ్నివీరుల భవిష్యత్ భద్రం

Exit mobile version