NTV Telugu Site icon

Vishnuvardhan Reddy : ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడం కోసం ఎన్నికల రోజునే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీకి ఉన్న ఓటమి భయాన్ని తెలియజేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ను తక్షణమే వెనక్కి తీసుకొని, పట్టభద్రులైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఇదిలా ఉంటే.. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read : Liam Neeson: భార్య మాట విని జేమ్స్ బాండ్ పాత్రను వదులుకున్న హీరో!

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ తేదీని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) విడుదల చేసింది. 2023, మార్చి 13వ తేదీ నుంచి పీఎంటీ/ పీఈటీని నిర్వహించనున్నట్లు సంస్థ అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేశారు. స్టేజీ 2 దరఖాస్తు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 20వ తేదీన ముగియడంతో.. తదుపరి రిక్రూట్‌మెంట్‌ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. పీఎంటీ/ పీఈటీ కాల్‌లెటర్లు మార్చి 01, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read : Pakistan: పాకిస్తాన్‌కు మోదీ కావాలి.. నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో..

Show comments