Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Manchu: కొన్ని సార్లు తెలియక చేస్తారో లేక తెలిసి చేస్తారో కానీ వారు చేసే చిన్న పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. అది సెలబ్రిటీలే అయితే ఈ మధ్య కాలంలో వారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు నెటిజన్స్. అలాంటిదే చేసి నటి రిచా చద్దా చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాక్‌ను ఉద్దేశించి గట్టి సమాధానం ఇస్తామని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను కోట్ చేస్తూ రిచా చద్దా గల్వాన్ సేస్ హాయ్ అంటూ రీట్వీట్ చేశారు. ఆమె ఉద్దేశం ఏంటో తెలియడం లేదు గానీ, ఆమె ట్వీట్‌లో వాడిన గల్వాన్ పదం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది.
Read Also: BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
బాలీవుడ్ నటి రిచా చద్దా గల్వాన్ సేస్ హాయ్ అని ఆమె రాయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ వివాదాస్పద ట్వీట్‌పై పలువురు ప్రముఖులూ స్పందించారు. ఆమె చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను మంచు విష్ణు పోస్ట్ చేస్తూ.. ‘‘ఆమెకు ఏమైంది… అసలు ఈ విధంగా ఎలా ఆలోచించగలరు.. సైనికులను మనం గౌరవించాలి. కృతజ్ఞతాభావం లేని వారిని చూస్తుంటే బాధగా ఉందని ట్వీట్ చేశారు. ‘‘ఈ పోస్ట్ చూస్తుంటే బాధగా ఉంది. ఏ అంశమూ.. సాయుధ దళాల పట్ల మనల్ని కృతజ్ఞత లేనివారిగా మార్చకూడదు’’ అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వారిని రిచా అవమానించారన్న బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ జూహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె.. ‘ఎవర్నీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదు. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’ అంటూ మరో పోస్ట్ పెట్టారు. తన తాత కూడా సైన్యంలో పనిచేశారన్న ఆమె.. చైనాతో యుద్ధంలో దేశం కోసం పోరాడినట్టు తెలిపారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!