Vishal: తాగుబోతుని కొట్టిన విశాల్.. రత్నం షూటింగ్ లో షాకింగ్ సంఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal beaten drunken man who is asking alcohol: నటుడు విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. నటుడు విశాల్ కెరీర్‌లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా మార్క్ ఆంటోనీ రికార్డు సృష్టించింది. ఇక మార్క్ ఆంటోని సక్సెస్ తర్వాత విశాల్ ప్రస్తుతం రత్నం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరు కలిసి చేసిన తామిరభరణి(తెలుగులో భరణి), పూజై(తెలుగులో పూజ) సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు రత్నం సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వీరిద్దరూ జతకట్టారు. రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే రత్నం సినిమా సెట్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Bhamakalapam 2 :ఆకట్టుకుంటున్న ప్రియమణి భామాకలాపం 2 గ్లింప్స్..
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
రత్నం కోసం టాస్మాక్ షాప్(మందుబాబుల కోసం తమిళనాడు ప్రభుత్వం నడిపే లిక్కర్ షాప్) లాంటి సెట్ వేశారు. ఇది నిజమైన టాస్మాక్ అని భావించి క్యూల వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు అక్కడి వారు బారులు తీరుతున్నారు. ఇది చూసిన నటుడు విశాల్.. మద్యం కొనుక్కోవడానికి అక్కడే నిలబడిన వారిని వెళ్లిపొమ్మని కోరారు. అయితే ఓ తాగుబోతు ఇంతకీ వినకపోవడంతో అతన్ని పట్టుకుని, ఇది రత్నం సినిమా కోసం ఏర్పాటు చేశానని చెప్పి కొట్టాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ విడుదలై వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమా లేక సినిమా షూట్ లో భాగమా అనేది కూడా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్‌లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?