ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతూ ఆహా ఓటీటీ ఎంతగానో పాపులర్ అయింది.ఇప్పటివరకు ఎన్నో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇదివరకు ఆహా ఓటీటీలో భామాకలాపం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.విజనరీ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది. ఇదివరకు భామాకలాపం 2 మూవీ గురించి ప్రకటించిన మేకర్స్ తాజాగా గ్లింప్స్ వీడియో విడుదల చేశారు.
భామాకలాపం 2 గ్లింప్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.ప్రియమణి మరియు శరణ్య సస్పెన్స్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్లో భామాకలాపం 2పై మరింత ఆసక్తిని పెంచారు…భామాకలాపం 2లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయక ఇల్లాలుగా మెప్పించనుంది. భామాకలాపం 2 చిత్రాన్ని డ్రీమ్ ఫార్మర్స్, బాపినీడు.బి మరియు సుదీర్ ఈదరతోపాటు ఆహా రూపొందిస్తోంది. అయితే, భామాకలాపం ఓటీటీలో మంచి విజయం సాధించగా.. భామాకలాపం 2 చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయనున్నారు. అంటే ఈసారి ప్రేక్షకులకు థియేటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి భామాకలాపం 2తో రానున్నారు.భామాకలాపం 2 చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్‌వార్ మరియు బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే భామాకలాపం 2 వంటి సెన్సేషనల్ ఒరిజనల్‌తో థియేటర్స్‌లో సందడి చేయటానికి సిద్ధంగా ఉండండి అని మేకర్స్ తెలిపారు.