Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag School Tragedy: విశాఖపట్నంలో దారుణం వెలుగు చూసింది.. విశాఖ నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ టీచర్ కొట్టడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. లిటిల్ గార్డెన్స్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడిని ప్రణయ తేజగా గుర్తించారు. అతడు యూకేజీ విద్యార్థిగా కుటుంబ సభ్యులు తెలిపారు. టీచర్ దెబ్బలకు బాలుడు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలుడిని కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
చిన్నారి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్ దెబ్బల కారణంగానే బాలుడు మృతి చెందాడా? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారిక విచారణలో వెల్లడికావాల్సి ఉంది.
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
అయితే, వైరల్‌గా మారిన ఓ వీడియో ప్రకారం మాత్రం.. తరగతి గదిలో అందరి క్లాస్ వర్క్ లేదా హోం వర్క్ చెక్ చేస్తున్న టీచర్ దగ్గరకు సదరు బాలుడు రగానే తీవ్రంగా ఏడవడం కనిపించింది.. వద్దు.. వద్దు అంటూ.. టీచర్‌ను బతిమిలాడుకున్నట్టుగా కనిపిస్తోంది.. కానీ, టీచర్.. అతడిని డ్రెస్‌ను సవరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఇంతలో ఆమె.. టై పట్టుకొని లాగడం.. బాలుడి చెప్పంపై ఓ దెబ్బ కొట్టడంతో.. వెంటనే ఆ బాలుడు.. టీచర్‌పైనే ఒరిగిపోయాడు.. ఆమె దూరం తీసి నిలబెట్టే ప్రయత్నం చేస్తే.. మళ్లీ పైకి ఒరిగాడు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. విద్యాబుద్ధులు నేర్పుతారని స్కూల్‌కు పంపిస్తే.. భయపెట్టి.. కొట్టి.. చంపేస్తారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.. అయితే, టీచర్ కొట్టడం వల్లే బాలుడు చనిపోయాడా? ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!