Site icon NTV Telugu

AP Crime News: న్యూడ్ వీడియోలు చిత్రీకరణ.. నలుగురు యువకులను చితకబాదిన యువతులు!

Nude Video Recording

Nude Video Recording

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ ఘటన కలకలం రేపుతోంది. లాడ్జిలో దిగిన యువతుల న్యూడ్ వీడియోలని చిత్రీకరించారనే ఆరోపణతో.. నలుగురు యువకులను యువతులు చితకబాదారు. ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crop Cultivation: తొలకరి పంటకే ఇన్ని కష్టాలైతే.. మరి రబీ పరిస్థితి ఏంటి?

విశాఖలోని ద్వారకలో బాయ్స్ హాస్టల్, లాడ్జి పక్కపక్కనే ఉన్నాయి. హాస్టల్‌లో నుంచి లాడ్జి బాత్రూంలోకి ఫోన్‌లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపణలు చేశారు. నాలుగు రోజులు నుంచి తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారు అంటూ మరో మహిళ యువకులపై దాడికి పాల్పడింది. నలుగురు యువకులను యువతులు చితకబాదారు. దేహశుద్ధి అనంతరం ద్వారక పోలీసులకి యువకులను అప్పగించారు యువతులు. ద్వారక పోలీసులు యువకులు సెల్ ఫోన్లు పరిశీలిస్తున్నరు. యువతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లాడ్జిలో ఉండే వారు యువకులకు సహరిస్తున్నారా? అని ఆరా తీస్తున్నారు.

Exit mobile version