Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు మాజీ విద్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ బ్యాటింగ్‌లో తన పోలికలు కనిపిస్తున్నాయని, అతను భారత జట్టు తరఫున సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ‘పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ 186 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 246 పరుగులు సాధించి తన అటాకింగ్ బ్యాటింగ్ ఏంటో నిరూపించుకున్నాడు.
ఈ సందర్భంగా వైభవ్ ఆటను ప్రశంసించిన సెహ్వాగ్, అతను ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని, తనలాగే మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడే ఆలోచనతో బరిలోకి దిగుతాడని తెలిపారు. అయితే భవిష్యత్తులో అతను భారత్ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనేది చూడాలని పేర్కొన్నారు. ఆటగాడి వయసు గురించి మాట్లాడుతూ.. అండర్-19 వంటి టోర్నీలలో నిబంధనల ప్రకారం వయసు పరిమితి ఉండాలి కానీ, ఐపీఎల్ లేదా టీమిండియా తరఫున ఆడేటప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేదని, కేవలం ప్రతిభ, ప్రదర్శనే ముఖ్యమని స్పష్టం చేశారు. 38, 40 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు, 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఆడితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రతిభ ఉంటే చిన్న వయసులోనే అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ఇదే సమయంలో భారత వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శనను కూడా సెహ్వాగ్ కొనియాడారు. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న గిల్, గతంలో ఇంగ్లండ్ పర్యటనలో అయిదు టెస్టుల్లో 754 పరుగులు చేసి సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేశాడని గుర్తుచేశారు. అలాగే ఇటీవలే వెస్టిండీస్‌తో గువాహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో కేవలం 133 బంతుల్లోనే 223 పరుగులు చేసి తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీ సాధించాడని ప్రశంసించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని రికార్డులు సృష్టిస్తూ.. రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా రాణించడం అంత సులభం కాదని సెహ్వాగ్ పేర్కొన్నారు. యువ ఆటగాళ్లు చూపుతున్న ఈ దూకుడు భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!