Site icon NTV Telugu

Virender Sehwag: ‘కుక్క తోకర వంకర’.. పాక్‌ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్

Virender Sehwag

Virender Sehwag

అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్, రాజస్థాన్, గుజారాత్ రాష్ట్రంలోని బార్డర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన వైఖరి తీసుకుంది. పాకిస్థాన్‌ను తిప్పికొట్టాలని నిర్ణయించింది.

READ MORE: Vikram Misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ

కాగా.. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ సంచలన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై వీరేంద్ర సెహ్వాగ్ పరోక్షంగా స్పందించారు. ‘కుక్క తోకర వంకర’ అని రాసి ఉన్న హిందీ సామెతను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు.. పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించడంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. ఈ అంశంపై భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ స్పందించారు.

READ MORE: Cease Fire Violation : గుజరాత్‌లో పాకిస్థాన్ డ్రోన్లు.. రాష్ట్ర మంత్రి కీలక సూచనలు…

సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మిస్రీ తెలిపారు. శనివారం రాత్రి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. “కాల్పుల విరమణ అవగాహనను పాక్‌ ఉల్లంఘించడం సరికాదు. డీజీఎంవో మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నాం. కొన్ని గంటలుగా పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఇది అత్యంత దుర్మార్గమం.” అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version