అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్, రాజస్థాన్, గుజారాత్ రాష్ట్రంలోని బార్డర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన వైఖరి తీసుకుంది. పాకిస్థాన్‌ను తిప్పికొట్టాలని నిర్ణయించింది.