Team India: టీమిండియాలో నాణ్యమైన స్పిన్నర్ లేడు: సెహ్వాగ్
- స్పిన్‌కు దాసోహమమైన భారత బ్యాటర్లు
- సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు
- దేశవాళీ క్రికెట్ బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం భారత్‌లో ఒక్క నాణ్యమైన స్పిన్నర్ లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే అని పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్నర్లు బంతిని సరిగ్గా ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారని వీరూ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటర్లు సరిగ్గా స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడంపై సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు అందరూ స్పిన్‌కు దాసోహమమైన విషయం తెలిసిందే.
వీరేంద్ర సెహ్వాగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘భారతదేశం నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి ప్రధాన కారణం వైట్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడటమే. టీ20ల్లో 24 బంతులను మాత్రమే వేస్తారు. దీంతో బంతిని ఫ్లైట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి బ్యాటర్లను ఔట్ చేసే నైపుణ్యంను సాధించలేరు. ఇక భారత క్రికెటర్లూ అతి తక్కువగానే దేశవాళీలో ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కంటే డొమిస్టిక్‌లోనే ఎక్కువ స్పిన్‌ను ఆడే అవకాశం దొరుకుతుంది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దేశవాళీ క్రికెట్ బెస్ట్’ అని అన్నాడు.
Also Read
Also Read: KBC 16: ఒలింపిక్స్‌పై ప్రశ్న.. కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్ కొద్దిలో మిస్ అయిన ఆదివాసీ!
‘మా కాలంలో ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, యువరాజ్.. మేమంతా దేశవాళీ క్రికెట్ కూడా ఆడేవాళ్లం. వన్డే లేదా నాలుగు రోజుల క్రికెట్ అయినా ఆడాం. మాకు చాలా మంది స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు దేశవాళీ క్రికెట్ బాగా ఉపయోగపడేది. ప్రస్తుతం ఆటగాళ్లకు వేర్వేరు లీగ్‌లు ఉన్నాయి. బిజీ షెడ్యూల్‌తో దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం ఉండటం లేదు. ప్రస్తుత టీమ్‌లో నాణ్యమైన స్పిన్ బౌలర్లు లేరనేది నా అభిప్రాయం. బంతిని ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారు’ అని వీరూ తెలిపాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!