ప్రస్తుతం భారత్‌లో ఒక్క నాణ్యమైన స్పిన్నర్ లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే అని పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్నర్లు బంతిని సరిగ్గా ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారని వీరూ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటర్లు సరిగ్గా స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడంపై సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు అందరూ స్పిన్‌కు దాసోహమమైన విషయం…