Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో SRH 55 పరుగులతో RCBపై ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే SRH బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు ఓ అభిమాని “49” అని సూచించే జెశ్చర్ చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ ప్రేక్షకుడు పలుమార్లు “49” అనే సంకేతాన్ని కోహ్లీ వైపు చూపిస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ “49” జెశ్చర్ 2017 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ఎదుర్కొన్న చేదు రికార్డును గుర్తు చేస్తోంది. అప్పట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో RCB కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యంత తక్కువ స్కోర్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సంఖ్యను ప్రత్యర్థి అభిమానులు సరదా ట్రోలింగ్‌లో భాగంగా ఉపయోగిస్తూ వస్తున్నారు.
Also Read
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
స్టేడియంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. హై వోల్టాజ్ మ్యాచ్ లలో ప్రేక్షకుల ప్రవర్తన ఎక్కడ వరకు ఉండాలి అనే అంశంపై కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సెటైర్‌పై కోహ్లీ ఎలాంటి స్పందన చూపలేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా తన ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టిన అతడు, మ్యాచ్ మొత్తం తన ఆటపైనే ఫోకస్ కొనసాగించాడు. అయితే ఎప్పుడు తన ఎమోషన్స్ ను దాచుకోని కోహ్లీ.. ఈసారి మాత్రం ఆ జెశ్చర్ ను కూడా చూసి సైలెంట్ గా ఉండడంతో అభిమానులు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.
No way a CSK fan showed 49 number on Virat Kohli's face 💀 pic.twitter.com/IjumjJ6tRR
— Deepu (@deepu_drops) May 23, 2026
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!