IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (Tim Seifert) వికెట్ తీసిన తర్వాత ఇచ్చిన అగ్రెసివ్ సెండాఫ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ (Bay Oval) వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 12వ ఓవర్లో సీఫెర్ట్‌ను అవుట్ చేసిన బ్రార్, ఆవేశంతో అతని దగ్గరకు వెళ్లి అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే, పరిస్థితి చేయి దాటకముందే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రంగంలోకి దిగి బ్రార్‌ను పక్కకు లాగి శాంతింపజేశాడు.
ఈ ఘటన 12వ ఓవర్ చివరి బంతికి జరిగింది. గుర్నూర్ బ్రార్ వేసిన బంతిని సీఫెర్ట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా, బంతి సరిగ్గా బ్యాట్‌కు తగలకుండా గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సులభంగా క్యాచ్ అందుకోవడంతో సీఫెర్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక మ్యాచ్ ప్రారంభం నుంచే సీఫెర్ట్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే బ్రార్‌కు, సీఫెర్ట్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. వికెట్ పడటానికి కొద్దిసేపటి ముందే సీఫెర్ట్ బౌండరీ కూడా బాదడంతో బ్రార్ కాస్త అసహనంతో ఉన్నాడు.
Also Read
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
- CP Mahesh Bhagwat: "అదే నా మొదటి ప్రాధాన్యత".. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- David Warner: "పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు".. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
అందుకే వికెట్ దక్కగానే బ్రార్ తన ఆవేశాన్ని ఆపుకోలేక సీఫెర్ట్ వైపు నడుచుకుంటూ వెళ్లి గట్టిగా అరుస్తూ సెండాఫ్ ఇచ్చాడు. బ్రార్ ప్రవర్తనతో సీఫెర్ట్ కూడా అసంతృప్తికి లోనై గొడవకు సిద్ధమైనట్లు కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన విరాట్ కోహ్లీ, తన యువ సహచరుడు బ్రార్‌ను పక్కకు లాక్కెళ్లి గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నాడు. కోహ్లీ బ్రార్‌ను కూల్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, ఈసారి ఏకంగా శాంతిదూతలా మారి గొడవను ఆపడంపై కామెంటేటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Gurnoor Brar had an exchange with Tim Seifert after dismissing him
Virat Kohli calm down both players
#Jason Kohat #pakvban GIFT Nifty Sonia Gandhi #IndiavsNz #4thODI VirstKohli #Microsoftcloud #Outlook, #Teams #Copilot #Microsoft365 LoganCircle #GTA6
https://t.co/m1L45l9u26— Quratul Ain (@Quratul69288714) November 13, 2026
తాజావార్తలు
-
IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
-
CP Mahesh Bhagwat: “అదే నా మొదటి ప్రాధాన్యత”.. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
David Warner: “పాపం.. పాట్ కమిన్స్ అతడిని బలిపశువును చేశాడు”.. కెప్టెన్‌పై వార్నర్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!