NTV Telugu Site icon

Virat Kohli-Anushka Sharma: అనుష్క ఏం చేస్తుందబ్బా.. స్టేడియంలో విరాట్ కోహ్లీ వెతుకులాట!

Virat Kohli Searches For Anushka Sharma

Virat Kohli Searches For Anushka Sharma

Virat Kohli tries to find Anushka Sharma during IND vs NZ Match: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంతే సరదాగా ఉంటాడు. సహచరులతో కలిసి తెగ అల్లరి చేస్తుంటాడు. భారత ఆటగాళ్లను ఇమిటేట్‌ చేస్తూ.. అప్పుడప్పుడు డ్యాన్స్‌తోనూ విరాట్ ఆకట్టుకుంటాడు. ఇవన్నీ ఓ ఎతైతే.. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ పట్ల ఎంతో ప్రేమగా ఉంటాడు. క్షణం కూడా ఆమెను విడిచిపెట్టి ఉండలేడు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది.

భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. స్టాండ్‌లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ కోసం వెతుకులాడాడు. భారత్ ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే కోహ్లీ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని బాల్కనీకి వచ్చిన కోహ్లీ.. అనుష్క కోసం పైన ఉన్న స్టాండ్ వైపు చూశాడు. అక్కడ అనుష్క కనిపించపోవడంతో.. వంగి మరీ వెతికాడు. అయినా కూడా తన భార్య కనిపించలేదు. దాంతో విరాట్ వెనక్కి వెళ్లిపోయాడు.

Also Read: Nandamuri Balakrishna: బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉంది..!

విరాట్ కోహ్లీ తన కోసం వెతకడంను అనుష్క శర్మ కూడా గమనించలేదు. ఆ సమయంలో మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘Yasha Mishra’ అనే ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. పురుషుల ప్రేమ చాలా భిన్నమైనది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘విరాట్ నువ్ సూపర్’, ‘భార్యపై ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘అనుష్క ఏం చేస్తుందబ్బా అని కోహ్లీ వెతుకుతున్నాడు’ అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క ప్రస్తుతం గర్భవతి కాబట్టి కోహ్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని ఫాన్స్ అంటున్నారు.

Show comments