Virat Kohli-Anushka Sharma: అనుష్క ఏం చేస్తుందబ్బా.. స్టేడియంలో విరాట్ కోహ్లీ వెతుకులాట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli tries to find Anushka Sharma during IND vs NZ Match: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంతే సరదాగా ఉంటాడు. సహచరులతో కలిసి తెగ అల్లరి చేస్తుంటాడు. భారత ఆటగాళ్లను ఇమిటేట్ చేస్తూ.. అప్పుడప్పుడు డ్యాన్స్‌తోనూ విరాట్ ఆకట్టుకుంటాడు. ఇవన్నీ ఓ ఎతైతే.. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ పట్ల ఎంతో ప్రేమగా ఉంటాడు. క్షణం కూడా ఆమెను విడిచిపెట్టి ఉండలేడు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది.
భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. స్టాండ్‌లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ కోసం వెతుకులాడాడు. భారత్ ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే కోహ్లీ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని బాల్కనీకి వచ్చిన కోహ్లీ.. అనుష్క కోసం పైన ఉన్న స్టాండ్ వైపు చూశాడు. అక్కడ అనుష్క కనిపించపోవడంతో.. వంగి మరీ వెతికాడు. అయినా కూడా తన భార్య కనిపించలేదు. దాంతో విరాట్ వెనక్కి వెళ్లిపోయాడు.
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
Also Read: Nandamuri Balakrishna: బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉంది..!
విరాట్ కోహ్లీ తన కోసం వెతకడంను అనుష్క శర్మ కూడా గమనించలేదు. ఆ సమయంలో మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘Yasha Mishra’ అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. పురుషుల ప్రేమ చాలా భిన్నమైనది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘విరాట్ నువ్ సూపర్’, ‘భార్యపై ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘అనుష్క ఏం చేస్తుందబ్బా అని కోహ్లీ వెతుకుతున్నాడు’ అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క ప్రస్తుతం గర్భవతి కాబట్టి కోహ్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని ఫాన్స్ అంటున్నారు.
Men in love is something very different 🥹❤️ #ViratKohli𓃵 #anushkasharma pic.twitter.com/gejjkrjJpi
— Yasha Mishra (@Yasha_yaar) November 15, 2023
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!