Virat Kohli-Rohit Sharma: ఫొటో దిగుదామని రోహిత్‌ను నేనే కోరా: కోహ్లీ
- 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
- ప్రపంచకప్ గెలవడం చాలా ప్రత్యేకం
- ట్రోఫీని పట్టుకోమని రోహిత్‌కి చెప్పా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Says Winning T20 World Cup is very special for Me: టీ20 ప్రపంచకప్ 2924 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ప్లేయర్స్ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. కాసేపటికి రోహిత్, కోహ్లీలు జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని.. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు.
రోహిత్ శర్మతో ఐకానిక్ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ తాజాగా తెలిపాడు. ప్రపంచకప్‌తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్‌ను తానే కోరినట్లు విరాట్ చెప్పాడు. ‘టీ20 ప్రపంచకప్ గెలవడం నాకే కాదు.. రోహిత్ శర్మకు కూడా చాలా ప్రత్యేకం. రోహిత్ ఫ్యామిలీ మైదానంలోనే ఉంది. సమైరాను భుజాలపై ఎత్తుకుని సంతోషపడ్డాడు. ఈ విజయం వెనక రోహిత్ కృషి ఎంతో ఉంది. కాసేపు ట్రోఫీని పట్టుకోమని రోహిత్‌కి చెప్పా. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే ఇద్దరం కలిసి ఫొటో దిగాం’ అని విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పాడు.
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
Also Read: Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో ఉండి ప్రపంచకప్ సాధించడం ఇదే మొదటిసారి. 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. అప్పటికి కోహ్లీ టీ20ల్లో అరంగేట్రం చేయలేదు. ఇక 2011 వన్డే ప్రపంచకప్ సాధించిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. అప్పుడు రోహిత్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. 2011 అనంతరం జరిగిన వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో ఇద్దరు కలిసి ఆడినా.. టీమిండియా కప్ సాధించలేదు.
తాజావార్తలు
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు