Wasim Jaffer: రోహిత్, కోహ్లీ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడరు: జాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలది ఓ చరిత్ర. వీరిద్దరూ ఒంటిచేత్తే జట్టుకు ఎన్నో విజయాల్ని అందించారు. తమ ఆటతీరుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు వీరు వయసురీత్యా కొన్ని ఫార్మాట్లలో ఆడకపోవచ్చని టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి టీ20 భవిష్యత్తుపై జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా వారిద్దరూ భారత జట్టుకు గొప్పగా సేవలందించారని.. అయితే వారి వయసు, ఫామ్‌ని బట్టి భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడతారా అనేది ప్రశ్నగా మారిందన్నాడు.
Also Read: ChatGPT: దూసుకెళ్తున్న చాట్‌జీపీటీ.. రెండు నెలల్లోనే రికార్డు యూజర్లు
Also Read
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- FIFA World Cup 2026: 'మంజాంబి' డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
“ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లోనే వన్డే ప్రపంచకప్ కూడా ఉంది. ప్రపంచకప్ వరకు రోహిత్, విరాట్ ఒత్తిడి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు వారికి విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చు. అయితే భవిష్యత్తును ఒకసారి పరిశీలిస్తే మాత్రం టీ20ల్లో కేవలం యువకులే ఉంటారు. తర్వాతి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడతాడని నేను అనుకోవట్లేదు. విరాట్‌కు కూడా అవకాశాలు తక్కువే. కానీ రోహిత్ మాత్రం కచ్చితంగా ఆడడు. ఎందుకంటే ప్రస్తుతం అతడి వయసు 36. అందువల్ల వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఎంత ఫిట్‌గా ఉంటాడో ఎలాంటి ఫామ్‌ని కొనసాగిస్తాడో చూడాలి” అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఫిబ్రవరి 9న భారత్ – ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్, రోహిత్ ఈ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నారు.
Also Read: Shaheen Afridi: షాహిద్ అఫ్రిది కూతురితో షహీన్ పెళ్లి..ఫోటోలు వైరల్
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!