Virat Kohli Dhurandhar 2 Review: “ధురంధర్-2” చూసి విరాట్ కోహ్లీ షాక్.. సినిమాపై కింగ్ హాట్ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Dhurandhar 2 Review: భారత్ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తాజాగా బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధురందర్ 2’ సినిమా చూశారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దర్శకుడు ఆదిత్య ధర్, కథానాయకుడు రణవీర్ సింగ్‌లను ప్రశంసిస్తూ ఇది తన జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ అని విరాట్ తెలిపాడు. భారత్ ఇలాంటి సినిమా అనుభవాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని కొనియాడాడు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిందని, ఒక్క నిమిషం కూడా కళ్లు తిప్పుకోలేకపోయానని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
READ MORE: Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ధురందర్ 2’ పోస్టర్‌ను పోస్ట్ చేసిన విరాట్.. “ఈ రోజే సినిమా చూశాను. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా అనుభవం ఇండియాలో ఇంతకుముందెన్నడూ చూడలేదని ఖచ్చితంగా చెప్పగలను. దాదాపు 4 గంటల పాటు కనురెప్ప వేయకుండా చూశాను, నాలో ప్రతి భావోద్వేగాన్ని ఈ సినిమా తట్టిలేపింది. డైరెక్టర్ ఆదిత్యా ధర్ మీ ప్రతిభ, పట్టుదల మీరు సృష్టించిన ఈ అద్భుతంలో కనిపిస్తున్నాయి. మీకు నా హ్యాట్సాఫ్. మీరు ఒక జీనియస్. ఇక నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ.. రణవీర్ ఈ సినిమా తర్వాత మీరు ఒక కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించి ఉంది. అబ్సల్యూట్లీ వావ్!” అని రాసుకొచ్చాడు.
READ MORE: Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..
మరోవైపు. బాక్సాఫీస్ వద్ద కూడా ‘ధురంధర్ 2’ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచే ప్రభంజనం సృష్టించింది. జియో స్టూడియోస్ గణాంకాల ప్రకారం, విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో విదేశీ వసూళ్లు ఏప్రిల్ 6 నాటికి రూ. 394 కోట్లుగా ఉండగా, దేశీయంగా రూ. 1228 కోట్ల గ్రాస్ (రూ. 1041 కోట్ల నెట్) వసూళ్లను రాబట్టింది. 18వ రోజున కూడా భారతవ్యాప్తంగా 14,229 షోల ద్వారా రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించి తన సత్తా చాటుతోంది.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!