NTV Telugu Site icon

Virat Kohli : విద్యార్థులకు ఎగ్జామ్ పేపర్ లో కోహ్లీపై ప్రశ్న.. అదేంటో తెలుసా..?

Kohli

Kohli

సాధారణంగా పాఠ్య పుస్తకాల్లో.. ప్రసిద్ది చెందిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్యాంశంగా చెప్పడం చూస్తుంటాం.. వీరికి సంబంధించిన ప్రశ్నలను.. విద్యార్థుల రాసే పరీక్షల్లో అడుగుతుండటం కూడా మనం చూస్తుంటాం.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఓ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ అడిగారు. ఇప్పటికే గతంలో పలువురు టాప్ క్రికెటర్లపై ప్రశ్నలు అడిగిన విషయాన్ని చాలా మందికి తెలిసింది. ఒక తాజాగా విరాట్ కూడా వారి సరసన చేరాడు. ఇంతకీ అతడి గురించి ఏం అడిగారంటే..

Also Read : Khalistan: ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి బదులు ఖలిస్తాన్ జెండా ఎగరేస్తాం..

రికార్డుల రారాజు, ఫిట్ నెస్ కా బాప్.. ఇలా ఎన్నో ముద్దు పేర్లతో కోహ్లీని పిలుచుకుంటుంటారు. ప్రపంచ క్రికెట్ ను తమ బ్యాట్ తో శాసించిన విరాట్.. గత కొంత కాలం ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.కెప్టెన్సీ కూడా పోగొట్టుకున్నాడు.. జట్టులో స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అలా దాదాపు మూడు సంవత్సరాల పాటు సెంచరీ చేయలేక కష్టాలు పడ్డాడు. అయితే ఈ విమర్శలకు చెక్ పెడుతూ.. అద్భుతమైన పునరాగమనం చేశాడు. గతేడాది జరిగిన ఆసియా కప్ నుంచి అద్భుతమైన ఫామ్ లోకి తిరిగి వచ్చేశాడు. ఆసియా కప్ 2022 ఆఫ్ఘానిస్తాన్ పై సూపర్ సెంచరీతో తన పూర్వ వైభవాన్ని పొందాడు. అలా తన రిథమ్ తో పాటు శతకం కోసం తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అది అతడికి తన అంతర్జాతీయ కెరీర్ లో 71వ శతకం కావడం విశేషంజ… మొత్తంగా టీ20, వన్డేలు, టెస్టుల్లో ముందు ఉన్న ఫామ్ లోకి వచ్చి.. ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ కు ఆదర్శంగా నిలిచాడు.

Also Read : Prakash Raj: విలక్షణానికి మరోపేరు ప్రకాశ్ రాజ్!

దీంతో విరాట్ పట్టుదల, అలుపెరగని పోరాటం గురించి ఓ స్కూల్ యాజమాన్యం.. తమ స్టూడెంట్స్ కు తెలియజేయాలనుకుంది. అందులో భాగంగానే ఆ స్కూల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు.. కోహ్లీ ఫామ్ లోకి వచ్చిన రీ ఎంట్రీ విధానం గురించి తెలపండి అంటూ ప్రశ్న అడిగింది. ప్రస్తుతం ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోల్లో విరాట్ కోహ్లీ తన 71వ ఇంటర్నేషనల్ సెంచరీ సెలబ్రేషన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. విరాట్ గురించి 100,120 పదాల్లో చెప్పాలని ఆ ప్రశ్నలో ఉంది. ఇక ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ గురించి 100 పదాలు కాదు.. పది పేజీలు అయినా రాయచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments