NTV Telugu Site icon

Virat Kohli: కొత్త మైలురాయికి దగ్గర్లో కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలే

Virat Kohli Record

Virat Kohli Record

విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం. ఈ ఘనత సాధించిన ఇతర బ్యాట్స్‌మెన్లలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071), జో రూట్ (3068) ఉన్నారు.

Read Also: March 1st New Rules: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఏవేవీ మారనున్నాయంటే?

కోహ్లీ వన్డే రికార్డులు:
కోహ్లీ 55 వన్డే మ్యాచ్‌లలో 47.01 సగటుతో 2915 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు చేశాడు. కోహ్లీ చివరిసారిగా న్యూజిలాండ్‌తో 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో 117 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌తో అత్యధిక పరుగుల రికార్డు:
కోహ్లీకి న్యూజిలాండ్‌తో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మన్‌గా 105 పరుగులు చేయడం మిగిలింది. ప్రస్తుతం.. సచిన్ టెండూల్కర్ 1750 పరుగులతో ఈ రికార్డును కలిగి ఉన్నారు. రికీ పాంటింగ్ 1971 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా.. మార్చి 2న, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఈ కొత్త మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.

ఫాంలోకి కోహ్లీ:

కాగా.. ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ దగ్గర నుంచి కోహ్లీ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో అర్ధ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. తర్వాత.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులు చేసి మరింత ఫాంలోకి వచ్చినట్లు ఫ్రూవ్ చేసుకున్నాడు.