Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ మొత్తం 770 ఫోర్లు బాదాడు. దీంతో అతను ఫోర్ల పరంగా టాప్ స్థానంలోకి ఎగబాకాడు. గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న కోహ్లీ, ఈ రికార్డుతో తన క్లాస్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.
Thuglife : ఒక్క క్షమాపణ విలువ రూ.12 కోట్లు.. కమల్ కఠిన నిర్ణయం..
ఇప్పటివరకు ఈ కేటగిరీలో టాప్ ప్లేస్‌లో ఉన్న శిఖర్ ధావన్ (768 ఫోర్లు)ను కోహ్లీ అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663 ఫోర్లు), రోహిత్ శర్మ (640 ఫోర్లు), అజింక్య రహానే (514 ఫోర్లు) ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్న కోహ్లీ, ఇప్పుడు అత్యధిక ఫోర్లు కొట్టిన క్రికెటర్‌గా నిలవడం గర్వకారణంగా భావిస్తున్నారు అభిమానులు.
ఐపీఎల్‌లో 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున మాత్రమే ఆడుతున్న కోహ్లీ, తన నిలకడ పోరాటంతో ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న ఆయన, ఇప్పుడు ఫోర్ల రికార్డు కూడా సొంతం చేసుకోవడంతో ఐపీఎల్‌లో కోహ్లీ ప్రభావం ఎంత విశేషమో మరోసారి రుజువైంది.
Kawasaki Z900: కొత్త ఇంజిన్, మోడర్న్ లుక్స్‌తో వచ్చేసిన 2025 కవాసాకి Z900..!
