విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో విరాట్ కోహ్లీ త్వరలో రెండోసారి తండ్రి కాబోతున్నాడని సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది.
Read Also: Earthquake: ఢిల్లీలో 2.6 తీవ్రతతో భూకంపం..
గతకొద్దీ రోజులుగా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని దంపతులిద్దరూ చెప్పడం లేదు. నిజమా కాదా అని కూడా దానిపై క్లారిటీ ఇవ్వడంలేదు. వారిపని వారు చూసుకుంటూ ఉంటున్నారు. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఛోటా విరాట్ రాబోతున్నడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వారిద్దరు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
Read Also: World Cup 2023: స్టార్ స్పోర్ట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల వివాహం డిసెంబర్ 2017లో జరిగింది. ఆ తరువాత వీరిద్దరూ జనవరి 2021లో మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ దంపతుల కుమార్తె వామిక 11 జనవరి 2021న జన్మించింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 8 మ్యాచ్‌ల్లో 108.60 సగటుతో 543 పరుగులు చేశాడు.