ఈనెల 6 నుంచి అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్ట్ మొదలు కానుంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. ఈ టెస్టులోనూ విక్టరీ సాధించాలని చూస్తోంది. అయితే.. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైంది. అతను వైద్య సహాయం కోరుతూ వీడియోలో కనిపించాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన చెందతున్నారు. ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధంచి ఒక వీడియో బయటికొచ్చింది. అందులో.. జట్టు వైద్య సిబ్బంది కోహ్లీ కుడి మోకాలికి బ్యాండేజ్ చేయడం కనిపించింది.
Read Also: Vitamin ‘D’ Deficiency: ‘విటమిన్ డి’ లోపం ఉంటే ఇవి తినండి.. మళ్లీ సమస్య రాదు..
ఈ వీడియోలో కోహ్లీ మోకాలికి కట్టు కట్టుకుని ఉన్నాడు. కాగా.. మెళ్లిమెళ్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్లినట్లు కనిపించింది. అయితే, కోహ్లీ నడిచిన తీరు చూస్తే పెద్ద గాయమైనట్లు ఏమీ ఉండదని తెలుస్తోంది. కోహ్లీ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతానికి ఏమీ తెలియనప్పటికీ, అతను పూర్తిగా ఫిట్‌గా తిరిగి మైదానంలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లీ ఫామ్ భారత్‌కు చాలా కీలకం కానుంది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరచగా.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా.. భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కంగారూ జట్టును 294 పరుగుల తేడాతో ఓడించింది.
Read Also: Nissan Magnite SUV: ఇండియాలో భారీగా అమ్ముడవుతున్న నిస్సాన్ మాగ్నైట్.. లక్షల్లో యూనిట్లు సేల్
పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసి కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మరోవైపు.. రెండో టెస్టులో కోహ్లీ మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు.