టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నా.. కింగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అతడికి కోసం ఫాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. గుజరాత్‌కు చెందిన ఓ అభిమాని తన మొబైల్ కవర్‌పై బంగారంతో కింగ్ ఫోటో, పేరును వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Kantara Chapter 1: బాప్‌రే.. 7 వేల స్క్రీన్‌లలో ‘కాంతార: చాప్టర్1’ రిలీజ్!
సూరత్‌లోని కుద్ సాద్ గ్రామానికి చెందిన అంకిత్ పటేల్ అనే యువకుడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఎక్కడున్నా సరే విరాట్ బ్యాటింగ్ తప్పకుండా చూస్తాడు. కోహ్లీని కలవడానికి మూడుసార్లు లండన్ వెళ్లాడంటే అంకిత్ అభిమానం ఎలాంటిదో ఇట్టే అర్ధమవుతోంది. అయితే మూడుసార్లు లండన్ వెళ్లినా.. ఒక్కసారి కూడా కోహ్లీని కలవలేకపోయాడు. కోహ్లీపై ఉన్న పిచ్చి ప్రేమతో.. కింగ్ ఫొటో, పేరును అతడి మొబైల్ కవర్‌పై బంగారంతో ప్రింట్ వేయించాడు. అంతేకాదు బ్రాస్లెట్ మీద కూడా విరాట్ పేరు రాయించుకున్నాడు. ఇందుకు గాను అతడికి రూ.15 లక్షల వరకు ఖర్చు అయిందట. ఈ విషయం తెలిస్తే.. విరాట్ కచ్చితంగా అంకిత్ను కలుస్తాడు. గతంలో తన అభిమానులను కింగ్ కలిసిన విషయం తెలిసిందే.