టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నా.. కింగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అతడికి కోసం ఫాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. గుజరాత్‌కు చెందిన ఓ అభిమాని తన మొబైల్ కవర్‌పై బంగారంతో కింగ్ ఫోటో, పేరును వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్,…