NTV Telugu Site icon

Virat Kohli Century: క్రికెట్ చరిత్రలో ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ.. సచిన్‌ టెండూల్కర్‌కు కూడా సాధ్యం కాలేదు!

Virat Kohli Century Lift

Virat Kohli Century Lift

Virat Kohli Created History On His 500th Match: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. మొత్తంగా 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 29వ సెంచరీ. అన్ని ఫార్మాట్‌లలో కలిపి శతకాల సంఖ్య 76. వెస్టిండీస్‌, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న వందో టెస్టులో కింగ్ సెంచరీ చేయడం విశేషం. ఇక భారత్ తరఫున కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కాగా.. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో (Virat Kohli 500th Match Century) శతకం బాదడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు కూడా ఇది సాధ్యం కాలేదు. సచిన్ తన వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. కోహ్లీ కంటే ముందు 9 మంది ఆటగాళ్లు మాత్రమే 500 మ్యాచ్‌ల కంటే ఎక్కువగా ఆడారు. ఇందులో ఎవరూ కూడా 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయలేదు.

Also Read: Virat Kohli Century: విదేశాల్లో 15 సెంచరీలు చేశా.. అదేమీ చెత్త రికార్డు కాదు: విరాట్ కోహ్లీ

500వ అంతర్జాతీయ మ్యాచ్‌లు భారత్ తరపున విరాట్ కోల్ కంటే ముందు ముగ్గురు ఆడారు. వారెవరూ తమ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీ సాధించలేదు. ఆ ఘనత ఒకే ఒక్కడు విరాట్‌ కోహ్లీకే దక్కింది. సచిన్‌ టెండూల్కర్ 35 పరుగులు చేయగా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 32 రన్స్ చేశాడు. ఇక ది వాల్ రాహుల్ ద్రవిడ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ప్రత్యేక మ్యాచ్‌లో శతకం చేసిన కోహ్లీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

సచిన్‌ టెండూల్కర్‌ను విరాట్ కోహ్లీ మరో రికార్డు విషయంలో అధిగమించాడు. సచిన్‌ 500 మ్యాచుల్లో 75 సెంచరీలు చేయగా.. కోహ్లీ 76 శతకాలతో కొనసాగుతున్నాడు. సచిన్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో 664 మ్యాచులు ఆడాడు. ఇందులో 100 శతకాలు ఉన్నాయి. కోహ్లీ 500 మ్యాచుల్లో 76 సెంచరీలు బాదాడు.

Also Read: Baby Movie Remuneration: బేబీ సినిమా హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్‌ ఇంత తక్కువా?

Show comments