Virat Kohli Records: సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ!
- ఎట్టకేలకు సిడ్నీలో మెరిసిన కోహ్లీ
- సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బద్దలు
- వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సిడ్నీలో మెరిశాడు. పెర్త్, అడిలైడ్‌లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో హాఫ్ సెంచరీతో అలరించాడు. 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ హాఫ్ సెంచరీతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. కింగ్ నెలకొల్పిన ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం.
వన్డే చరిత్రలో లక్ష ఛేదనలో (వన్డేల్లో ఛేజింగ్) విరాట్ కోహ్లీ 6,000 పరుగులు పూర్తి చేశాడు. ఛేదనలో 6 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 102 ఇన్నింగ్స్‌లలో 89.29 సగటుతో 6,072 పరుగులు సాధించి.. లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 232 ఇన్నింగ్స్‌లలో 69 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కోహ్లీ 161 ఇన్నింగ్స్‌లలో 70 సార్లు 50+ పరుగులు చేశాడు. 153 ఇన్నింగ్స్‌లలో 55 సార్లు ఈ ఘనత సాధించిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. సిడ్నీ హాఫ్ సెంచరీతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరని అధిగమించి.. కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో లెజెండ్ సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. విరాట్ 305 మ్యాచ్‌ల్లో 57.69 సగటుతో 14,250 పరుగులు చేశాడు. సంగక్కర 404 మ్యాచ్‌ల్లో 14,234 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!