NTV Telugu Site icon

Virat Kohli: రికార్డుల పరంపర.. ఆ హిట్ లిస్ట్‌లోకి కోహ్లీ

Virat Kohli Jersey

Virat Kohli Jersey

విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు. అత్యధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో స‌చిన్ టెండూల్కర్‌, కుమార సంగ‌క్కర (శ్రీలంక‌) ఉన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర 402 వన్డే మ్యాచ్‌లలో 378 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. సచిన్ 463 వన్డే మ్యాచ్‌లలో 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశాడు.

Read Also: Group 2 Mains: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు.. 92 శాతం హాజరు

14,000 పరుగులు పూర్తి
సచిన్ టెండూల్కర్ 359 వన్డే మ్యాచ్‌లలో 350 ఇన్నింగ్స్‌లలో 14,000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 299 వన్డే మ్యాచ్‌లలో 287 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు 300 కంటే తక్కువ వన్డేల్లో 14,000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కోహ్లీ. 13వ ఓవర్లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి ఈ ఘనత సాధించాడు. సెప్టెంబర్ 2023లో కొలంబోలో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ 13,000 వన్డే పరుగులను పూర్తిచేశాడు.

అత్యధిక క్యాచ్‌లు
ఈ రోజు అజారుద్దీన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. తన 299వ వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 157వ క్యాచ్‌ను పట్టాడు. అజార్ 1985 నుండి 2000 మధ్య 334 వన్డేలు ఆడి 156 క్యాచ్‌లు పట్టాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా ఇచ్చిన డైవింగ్ క్యాచ్‌ను కోహ్లీ అందుకున్నాడు. ఆ తర్వాత.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్‌లో ఖుస్దిల్ షా క్యాచ్‌ను కోహ్లీ పట్టాడు.