Site icon NTV Telugu

All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్‌ ఎలెవన్‌.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!

Varun Chakravarthy

Varun Chakravarthy

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ట్రోఫీ గెలవడంతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి కీలకపాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అద్భుత బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్‌.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇంటర్వ్యూలో భాగంగా తన టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను వరుణ్‌ ఎంచుకున్నాడు. అయితే అతడి జట్టులో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు అవకాశం ఇవ్వలేదు.

ఇప్పటివరకు ఎవరితో కలిసి ఆడావో వారిలో నుంచే టీమ్‌ ఎంపిక ఉండాలని వరుణ్ చక్రవర్తికి ఆర్ అశ్విన్ కండిషన్ పెట్టాడు. భారత్ నుంచి ముగ్గురిని ఎంచుకోగా.. అందులో సూర్యకుమార్ యాదవ్‌, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాలు ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. 2021 టీ20 ప్రపంచకప్‌ సమయంలో విరాట్ కోహ్లీ సారథ్యంలో వరుణ్ పొట్టి ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇక 2025 ఆరంభంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. అయినప్పటికీ వరుణ్ జట్టులో వారిద్దరికీ చోటు దక్కలేదు.

Also Read: ENG vs IND: అలా ఇంగ్లండ్‌కు రావొద్దు.. కుల్దీప్ యాదవ్‌కు పీటర్సన్ సూచనలు!

వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీమ్‌లో జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ను మూడో స్థానంలో, నికోలస్ పూరన్‌ను నాలుగో స్థానంలో తీసుకున్నాడు. కీపర్‌గా హెన్రిచ్ క్లాసెన్‌ను ఎంచుకున్న వరుణ్.. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్‌లకు అవకాశం ఇచ్చాడు. స్పిన్‌ కోటాలో సునీల్ నరైన్, రషీద్‌ ఖాన్‌లకు చోటివ్వగా.. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మతిశా పతిరనలకు ఎంచుకున్నాడు.

వరుణ్ చక్రవర్తి టీమ్:
జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్‌, సూర్యకుమార్ యాదవ్‌, నికోలస్ పూరన్‌, హెన్రిచ్ క్లాసెన్‌, హార్దిక్ పాండ్య, ఆండ్రీ రస్సెల్‌, సునీల్ నరైన్, రషీద్‌ ఖాన్‌, జస్ప్రీత్ బుమ్రా, మతిశా పతిరన.

 

Exit mobile version